నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ గంగపుత్ర నేతృత్వంలోని ఉపాధ్యాయ బృందం నిరంతర పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నార్తులకు ఎంఈఓ బృందం చేస్తున్న సాయంలో తామూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే సేవా చేసేందుకు ముందుకు వచ్చామని తెరాస నేత, నిజామాబాద్ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర తెలిపారు.
పండ్లు, మినరల్ వాటర్ బాటిల్స్...
ఈ సందర్భంగా అరటి పండ్లు, బత్తాయి పండ్లు, మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామన్నారు. వాహనదారులకు, వలస కూలీలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అన్నయ్య కోరారు. అనంతరం సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తోన్న బట్టు రాజేశ్వర్ గంగపుత్రను నగర సంఘం ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రజలంతా భౌతిక దూరం తప్పక పాటించాలని ఎంఈఓ సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో నగర గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి మాకు రవి , అసోసియేటడ్ అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు తోపారం కిషన్, దగ్గుల మధుసూదన్, ముడారి వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నార్తులకు పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!