తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ - నిజామాబాద్​ కలెక్టరేట్​లో పేదలకు నిత్యావసరాల పంపిణీ

నిజామాబాద్​ జిల్లాలో టీఎన్జీవోస్​, ముత్తూట్​ ఫైనాన్స్​ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్​ సి.నారాయణ రెడ్డి హాజరై సరకులు అందించారు.

Tngos and Muthoot Finance
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

By

Published : Apr 10, 2020, 3:41 AM IST

లాక్​డౌన్​ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు తమ వంతు సాయంగా టీఎన్జీవోస్​, ముత్తూట్​ ఫైనాన్స్​ సంయుక్తంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్​ సి.నారాయణ సుమారు మూడొందల మందికి బియ్యం, పప్పు, కారంపొడి, పసుపు, టీ పొడి, నూనె అందించారు.

అనంతరం జిల్లాలోని మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంట్ కిషన్, సెక్రెటరీ అమృత్ కుమార్, ముత్తూట్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఒకటికి రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details