ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. కేబుళ్లు, ఇతర సామగ్రి కాలి దట్టమైన పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండో అంతస్తులో ప్రమాదం జరగడంతో రెండు జిల్లాకు చెందిన సెల్ ఫోన్ టవర్లు, అంతర్జాల సేవలకు చెందిన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. కేబుళ్లు కాలిపోవడం వల్ల రెండు జిల్లాలో సేవలు నిలిచిపోయాయి. దాదాపు 50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్‌లో బీఎస్ఎన్ఎల్ సేవలకు అంతరాయం - undefined
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఎస్‌ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల 2జీ, 3జీ పరికరాలు దగ్ధమయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో బీఎస్‌ఎన్ఎల్ సేవలకు అంతరాయం
నిజామాబాద్ జిల్లాలో బీఎస్‌ఎన్ఎల్ సేవలకు అంతరాయం
ఇవీ చూడండి: పెళ్లైన రెండో రోజే... పందిట్లో నలుగురు మృతి
Last Updated : Jun 22, 2019, 3:52 PM IST
TAGGED:
bsnl-agnipramadam