కరోన పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇతరులు ఎవ్వరూ కంటైన్మెంట్ జోన్లలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని కంటైన్మెంట్ ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.
కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షించిన డీఐజీ - నిజామాబాద్ జిల్లా కరోనా వార్తలు
నిజామాబాద్ డివిజన్ పరిధిలోని కంటైన్మెంట్ జోన్లను డీఐజీ శివ శంకర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు అందించారు.
కంటైన్మెంట్ జోన్లను పర్యవేక్షించిన డీఐజీ
నిర్బంధ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు నేరుగా ఇళ్ల వద్దకు అందించే విధంగా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నట్టు డీఐజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీ కార్తికేయ, అడిషనల్ సీపీ ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం అంతకుమించి..