నిజామాబాద్ డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. డీసీసీబీ ఛైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా రమేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంస్ ఛైర్మన్‌గా మోహన్, వైస్‌ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు.
నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌గా పోచారం తనయుడు ఏకగ్రీవం - DCCB ELECTIONS IN TELANGANA
నిజామాబాద్‌లోని డీసీసీబీ, డీసీఎంఎస్‌లోని అన్ని పదవులు ఏకగ్రీవమయ్యాయి. డీసీసీబీ ఛైర్మన్‌గా సభాపతి పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యకర్తలు, అనుచరులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.
ఒక్కో పదవికి ఒక్కొక్కరి చొప్పున నామినేషన్లు రావటం వల్ల 11గంటల తర్వాత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పార్టీ తరఫున మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్నికను పర్యవేక్షించారు. భాస్కర్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికైన ఆనందంతో కార్యకర్తలు, అనుచరులు టపాసులు కాల్చారు.
డీసీసీబీ, డీసీఎంఎస్‌లో అన్ని డైరెక్టర్ స్థానాలతోపాటు ఛైర్మన్, వైస్ఛైర్మన్లను ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉందని... పార్టీ అధిష్ఠానం ఆదేశాలకనుగుణంగానే అందరూ నడుచుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డీసీసీబీని రాష్ట్రంలో అగ్రస్థానంగా నిలపడమే లక్ష్యంగా పని చేస్తానని ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.