తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తే... భూములు కబ్జా చేశారు' - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ జిల్లా దత్తపూర్ దళిత సంఘం నాయకులు ఆందోళనకి దిగారు. ఎస్సీలపై దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఎస్సీల భూములు కబ్జా చేశారని ఆరోపించారు.

dattapur-dalit-association-protest-against-land-scam-in-nizamabad-district
'ఉపాధి కోసం ఎస్సీలు ఇతర ప్రాంతాలకు వెళ్తే... కబ్జా చేశారు'

By

Published : Mar 2, 2021, 5:16 PM IST

నిజామాబాద్ జిల్లా దత్తపూర్​ గ్రామంలో ఎస్సీలపై దాడులకు పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆ గ్రామ దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ గ్రామంలో సుమారు 1976 నుంచి దళితులు భూములను సాగు చేసుకుంటుండగా... వారిపై అగ్రవర్ణ కులస్థులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఉపాధి లేక ఎస్సీలు ఇతర ప్రాంతాలకు వెళ్తే... ఆ భూములను కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల ఆధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పెట్రో బాదుడు నుంచి త్వరలోనే ఊరట!

ABOUT THE AUTHOR

...view details