జైపాల్ రెడ్డి మృతికి రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సంతాపం ప్రకటించి... కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్ రెడ్డి తన రాజకీయ గురువని.. ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు . ఆయన సలహాలు, సూచనలు తన రాజకీయం ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే జైపాల్ రెడ్డి తనని ఎంతో ప్రభావితం చేశారని గుర్తు చేసుకున్నారు. ఎన్నో పదవులు నిర్వర్తించినా ఒక్క అవినీతి మరక లేకుండా పని చేశారని చెప్పుకొచ్చారు. ఆయన మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు.
'జైపాల్ రెడ్డి మృతి దేశానికి తీరని లోటు' - Darmapuri srinivas
జైపాల్ రెడ్డి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటన్నారు రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్. ఆయన మృతికి డీఎస్ సంతాపం తెలిపారు.
Jaipal Reddy