DS Joining in Congress: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈ నెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన డీఎస్.. 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని డీఎస్ నిర్ణయించుకున్నారు.
డీఎస్ రాక వెనుక అసలు కారణం ఆయన పెద్ద కుమారుడు సంజయ్ అంటున్నాయి పార్టీ వర్గాలు. సంజయ్ సైతం రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే పార్టీలో చేరేందుకు సంసిద్ధతను తెలిపారు. ఇప్పుడు సంజయ్‌కు రాజకీయ భవిష్యత్‌ను అందించేందుకు డీఎస్ తిరిగి పాత గూటికి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎంపీ అర్వింద్ సైతం తన తండ్రిని భాజపాలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఒకవేళ డీఎస్ భాజపాలోకి వస్తే స్వాగతిస్తామని ఓ ప్రకటనలో చెప్పారు.