తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట కోసే యంత్రాలను పరిశీలించిన కలెక్టర్​ నారాయణరెడ్డి - collector narayanreddy at kaaloor

నిజామాబాద్​ జిల్లాలో పంట కోస్తున్న యంత్రాలను కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ విధానంలో పాటించాల్సిన చర్యలపై రైతులకు, హార్వెస్టర్​ యజమానులకు పలు సూచనలు చేశారు.

crop harvesting inspected by nizamabad collector narayanreddy at kaloor
పంట కోసే యంత్రాలను పరిశీలించిన కలెక్టర్​ నారాయణరెడ్డి

By

Published : Oct 30, 2020, 10:52 PM IST

నిజామాబాద్​ జిల్లాలోని కాలూర్​ ప్రాంతంలో పొలాలు కోస్తున్న యంత్రాలను కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. రైతులకు, హార్వెస్టర్​ యజమానులకు పలు సూచనలు చేశారు. పంటకోసే సమయంలో రైతులు, హార్వెస్టర్​ యజమానులు పాటించాల్సిన జాగ్రత్తలు సరిగ్గా పాటించేలా చూసుకోవాలని తెలిపారు.

యంత్రం ఫ్యాన్​స్పీడ్​ 19-20 ఆర్పీఎం మాత్రమే ఉండాలని.. హార్వెస్టర్​ను ఏ2, ఏ3 గేర్​లో నడపాలన్నారు. ఇలా చేయడం వల్ల రైతులకు నాణ్యమైన వడ్లు వస్తాయని కలెక్టర్​ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి హార్వెస్టర్​ యజమాని, రైతులు తాను చెప్పిన సూచనలు పాటించాలని నారాయణరెడ్డి కోరారు.

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్​ నారాయణరెడ్డి

ఇదీ చదవండిఃగత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?

ABOUT THE AUTHOR

...view details