భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్గురుల 90వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని దాస్‌నగర్ నుంచి కలెక్టరేట్ వరకు రైతు, యువజన పాదయాత్ర చేపట్టారు. దోపిడీ, పీడన లేని సమాజం కోసం భగత్ సింగ్ కలలుగన్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. మోదీ సర్కారు... బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణంగా ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు.
'మోదీ సర్కారు... బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణం' - Cpm rally news
అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని నిజామబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో రైతు, యువజన పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమం దాస్‌నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగింది.
'మోదీ సర్కారు... బ్రిటిష్ ప్రభుత్వం కంటే దారుణం'
రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసించాలన్నారు. భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు పోరాట స్ఫూర్తితో పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు.
ఇదీ చూడండి: 'అమరులను స్మరించుకునేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్'