ప్రజలకు అండగా ఉండటానికి సీపీఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సీపీఎం సీనియర్ నాయకులు ఎం. గంగాధర్ ప్రారంభించారు. జిల్లాలోని నిరుపేదలు, సాధారణ కరోనా లక్షణాలు కలిగి.. ఇంట్లో ఉండటం ఇబ్బంది ఉన్నవారు తమ కార్యాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
సీపీఎం కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు
కరోనా బాధితులకు తమ వంతు సాయం అందించేేందుకు నిజామాబాద్ సీపీఎం నాయకులు ముందుకు వచ్చారు. తమ పార్టీ కార్యాలయాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు.
సీపీఎం కార్యాలయంలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు
కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఐసోలేషన్ కేంద్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేశ్ బాబు, పెద్ద వెంకట్ రాములు, గోవర్దన్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత