జాత్యహంకార హత్యలను ఖండించాలంటూ... నిజామాబాద్ జిల్లా సీపీఐ(ఏంల్) డిమాండ్ చేసింది. నగరంలోని ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రపంచం ముందు అమెరికా నిజస్వరూపం బయటపడిందని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ స్పష్టం చేశారు. నల్ల జాతికి చెందిన జార్జ్ ప్లాయిడ్ హత్యను నిరసిస్తూ నిరసన తెలియజేశారు.
జాత్యహంకార హత్యలను ఖండించండి: సీపీఐ(ఎంఎల్) - cpiml leaders protest against trump
నిజామాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద సీపీఐ(ఎంఎల్) నాయకులు ధర్నా నిర్వహించారు. జాత్యహంకార హత్యలను నిరసిస్తూ.... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
cpiml leaders protest against trump
నాడు భారత జాతిపిత మహాత్మా గాంధీని కూడా నల్లజాతీయుడని అవమానించిన చరిత్ర... నేటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా జాత్యహంకార దాడులు, హత్యలను భారత ప్రభుత్వం, ప్రజలు అందరూ ఖండించాలని నాయకులు కోరారు.