ఆర్టీసీ కార్మికుల ఎనిమిదో రోజు సమ్మెకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మర్చిపోలేనిదని, నేడు ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గంగాధర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
డిచ్‌పల్లిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఐ ర్యాలీ - latest news of rtc strike in support of dich palli by cpi raly
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మెకు మద్దతుగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీని తీశారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిచ్‌పల్లిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సీపీఐ ర్యాలీ
TAGGED:
ర్యాలీ