నిజామాబాద్‌లోని గాంధీ చౌక్‌లో నిజామాబాద్ డివిజన్ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ నాయకులు నిరసన తెలియజేశారు. అమెరికాలో జరుగుతున్న జాత్యాహంకార దాడులు, హత్యలకు వ్యతిరేకంగా మహాత్మగాంధీ విగ్రహం ముందు మూతికి నల్లగుడ్డ కట్టుకొని న్యూ డెమొక్రసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షను అందరం కలిసి వ్యతిరేకించాలని కోరారు.
జాత్యాహంకార దాడులపై న్యూ డెమొక్రసీ నిరసన - CPIML Protest
అమెరికాలో జాత్యాహంకార హత్యలు, దాడులకు వ్యతిరేకంగా నిజామాబాద్‌లోని గాంధీ చౌక్ వద్ద నగర డివిజన్ సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జాతి వివక్షను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. అప్పుడే సమానత్వం సాధ్యమని నాయకులు అన్నారు.
జాత్యాహంకార దాడులపై న్యూ డెమొక్రసీ నిరసన