తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు చలాన్లు బకాయి ఉంటే వాహనం సీజ్​: సీపీ - జరిమానా కట్టకపోతే వాహనం సీజ్​

మూడు చలాన్లు పెండింగ్​లో ఉంటే వాహనాన్ని సీజ్​ చేస్తామని నిజామాబాద్​ సీపీ కార్తికేయ హెచ్చరించారు. రాజీవ్​ రహదారిపై స్పీడ్​ లేజన్​ గన్​ పనితీరును సీపీ పరిశీలించారు.

cp karthikeya warns riders on pending challan
మూడు చలాన్లు బకాయి ఉంటే వాహనం సీజ్​: సీపీ

By

Published : Feb 11, 2020, 11:32 PM IST

ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకే స్పీడ్​ లేజన్​ గన్​లను ఏర్పాటుచేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్‌ కార్తీకేయ తెలిపారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

డాప్లర్‌ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్‌ గన్‌ వాహన వేగం లెక్కిస్తుందని చెప్పారు. వాహనం నంబర్‌ ప్లేట్‌ వివరాల ఆధారంగా చలానా జనరేట్‌ అవుతుందన్నారు. వాహనం 200 మీటర్ల దూరం వెళ్లేలోపు ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో చలానా వస్తుందని తెలిపారు. స్పీడ్‌ అధికంగా ఉన్న వాహనదారులకు రూ.1000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. మూడు చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు.

మూడు చలాన్లు బకాయి ఉంటే వాహనం సీజ్​: సీపీ

ఇవీచూడండి:నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్​ కాలుష్యకాసారమవుతుంది: సీఎం

ABOUT THE AUTHOR

...view details