నిజామాబాద్ నగరంలోని స్థానిక మిర్చి కాంపౌండ్‌లోని వీధుల్లో ఆవు పిడకలు, కర్పూరం, ఆవు నెయ్యి, యజ్ఞ సామగ్రిని కలిపి హోమ ధూపంతో వాయు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవు నెయ్యి, పేడ, కర్పూరం ఇవన్నీ యజ్ఞంలో ఉపయోగించే గొప్ప ఔషధ గుణాలున్న పదార్థాలని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ తెలిపారు.
నిజామాబాద్ వీధుల్లో వాయు శుద్ధి కార్యక్రమం - తెలంగాణ వార్తలు
గాలిలో ఉన్న వైరస్, హానికర బ్యాక్టీరియా నిర్మూలనకు నిజామాబాద్‌లోని మిర్చి కాంపౌండ్ వీధుల్లో ఆవు పిడకలు, కర్పూరం, నెయ్యి, యజ్ఞ సామగ్రితో ధూపం వేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ పాల్గొన్నారు.
![నిజామాబాద్ వీధుల్లో వాయు శుద్ధి కార్యక్రమం నిజామాబాద్ వీధుల్లో వాయు శుద్ధి కార్యక్రమం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:40:13:1621181413-tg-nzb-08-16-vayu-shudhi-av-ts10123-16052021203224-1605f-1621177344-138.jpg)
నిజామాబాద్ వీధుల్లో వాయు శుద్ధి కార్యక్రమం
వీటి వల్ల గాలిలో ఉన్న వైరస్, హానికారక బ్యాక్టీరియాలు చనిపోయి ప్రాణ వాయువు ఉత్పత్తి అవుతుందని, గాలి శుద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం నగరంలోని అన్ని ప్రాంతాలతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.