తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారీ దవాఖాన నుంచి ఒకేరోజు 210 మంది డిశ్చార్జ్ - నిజామాబాద్​ జిల్లా వార్తలు

కరోనా సోకి నిజామాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 210 మంది బాధితులు ఇవాళ డిశ్చార్డ్​ అయ్యారు. వైద్యులు తమను కంటికి రెప్పలా చూసుకున్నారని వారు తెలిపారు.

covid victims discharge from nizamabad government hospital
నిజామాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 210 మంది డిశ్చార్జ్

By

Published : Aug 11, 2020, 7:38 PM IST

కొవిడ్ బారిన పడి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్న 210 మంది కరోనా బాధితులు నేడు డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాలు పోతాయనే భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తమను వైద్యులు కంటికి రెప్పలా చూసుకున్నారని వారు పేర్కొన్నారు. వైద్యులు తమకు ధైర్యం చెప్తూ ప్రతిరోజు వైద్యాన్ని అందించినట్లు తెలిపారు, మంచి పౌష్టికాహారాన్ని అందించారన్నారు. కరోనా నుంచి కోలుకున్న బాధితులను వైద్యులు చప్పట్లతో ఇళ్లకు సాగనంపారు.

వారికి నయం కావడంలో కీలక పాత్ర వహించిన వైద్యులకు ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రతిమ రాజ్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్, శానిటేషన్ సేవలు బాగున్నాయని కరోనా నుంచి కోలుకున్న పలువురు కొనియాడారు.

ఇవీ చూడండి:70 శాతానికి చేరువలో కరోనా రికవరీ రేటు

ABOUT THE AUTHOR

...view details