నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్కు చెందిన ఓ మహిళ పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత గర్భం దాల్చింది. గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని తేలడంతో ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో అక్టోబర్ 22న ఆ మహిళ నిజామాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చింది.
''ఆమె వచ్చే సమాయానికే డెలివరీ టైం దగ్గరపడింది. వెంటనే మా సిబ్బంది ఆమెకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి కూడా మేము వెనుకడుగు వేయలేదు. హైదరాబాద్కు సిఫార్సు చేయకుండానే ట్రీట్మెంట్ అందించాం. తగిన జాగ్రత్తలతో మహిళకు సిజేరియన్ చేయగా... ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ బిడ్డను జన్మనిచ్చింది. పిల్లలు 1.2, 1.2, 1.5 కేజీల తక్కువ బరువుతో జన్మించారు. వారిని వెంటనే ఆస్పత్రిలోనే ఎన్ఐసీయూలో చేర్చుకుని వైద్యం అందించాము.''