తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిన్న ఒక్కరోజే 16 కేసులు... అంతా మర్కజ్​ వెళ్లినవారే'

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా​లో నిన్న ఒక్కరోజే 16 కేసులు నమోదు కాగా... వీరందరూ దిల్లీలోని మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారుగా అధికారులు గుర్తించారు.

corona positive cases news in nizamabad
'నిన్న ఒక్కరోజే 16 కేసులు... అంతా మర్కజ్​ వెళ్లినవారే'

By

Published : Apr 4, 2020, 10:01 AM IST

నిజామాబాద్​ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్న ఒక్కరోజే 16 పాజిటివ్​ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 18కి చేరింది. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోయాడు. జిల్లా నుంచి మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారిలో 42 మంది నమూనాలు సేకరించి... పరీక్షలకు పంపగా 41 మంది రిపోర్టులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

వీరిలో 16 మందికి కరోనా పాజిటివ్, 25 మందికి నెగిటివ్​ వచ్చినట్లు వెల్లడించారు. నెగెటివ్ వచ్చిన వారిని మరికొన్ని రోజులు క్వారంటైన్​లో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలిస్తామని.... వీరి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు సేకరించామని తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురి కావొద్దని... ఎవరైనా దిల్లీ వెళ్లిన వారు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు.

కామారెడ్డి జిల్లాలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గత మూడు రోజుల్లోనే ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా... శుక్రవారం మరో మూడు కేసులు పాజిటివ్ వచ్చాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 8 కేసులు నమోదు కాగా.. బాన్సువాడలోనే 7 కేసులు వచ్చాయి. జిల్లా నుంచి మొత్తం 8 మంది మర్కజ్ వెళ్లి రాగా.. వారిలో బాన్సువాడ నుంచి వెళ్లిన ముగ్గురికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీరితో సన్నిహితంగా ఉన్న మరో నలుగురికి సైతం కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇవీ చూడండి:రాజధానిపై కరోనా పడగ

ABOUT THE AUTHOR

...view details