కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన ఓ పేదకుటుంబం మూణ్నెళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి వలస వచ్చింది. కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తోంది. మూడ్రోజుల క్రితం ఆ కుటుంబ పెద్దకు కరోనా సోకినట్లు నిర్ధరణ అవ్వడం వల్ల గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు.
'కరోనా సోకిందని కుటుంబంతో సహా వెలివేశారు' - corona patient in compost shed in nizamabad
ఓ కుటుంబ పెద్దకు కరోనా సోకితే.. ఆ కుటుంబం ఊళ్లో ఉండటానికి నిరాకరించారు ఆ గ్రామస్థులు. ఎటువెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఊరి చివర్లో ఉన్న కంపోస్టు షెడ్డులో తలదాచుకుంటున్నారు. పరిశుభ్రమైన పరిసరాల్లో ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన కరోనా బాధితుడు.. పేడ కంపులో ఎండకు ఎండాల్సిన దుస్థితి ఏర్పడింది.
!['కరోనా సోకిందని కుటుంబంతో సహా వెలివేశారు' corona victim, corona victim in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11294255-698-11294255-1617675188339.jpg)
కరోనా బాధితుడు, నిజామాబాద్‌లో కరోనా
ఊరికి దూరంగా ఉండాలన్న గ్రామస్థుల డిమాండ్‌తో బాధితుడు సహా ఆయన కుటుంబమంతా గ్రామ పొలిమేరల్లోని కంపోస్టు షెడ్డులో తలదాచుకుంది. రెండ్రోజులుగా కరోనా సోకిన వ్యక్తి కంపోస్టు షెడ్డు లోపల ఉండగా ఆయన భార్య, కుమారుడు, కుమార్తె షెడ్డు బయట తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.