తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ప్రాంతాలకు మరిన్నీ అంబులెన్సులు, కరోనా కిట్లు - telangana varthalu

కొవిడ్​ తీవ్రత దృష్ట్యా మెట్‌పల్లి, కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాలకు మరిన్నీ అంబులెన్స్‌లు, కరోనా నిర్ధరణ పరీక్షల కిట్లును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పరీక్షలు చేయించుకునేందుకు కిట్లు లేవని ప్రజలు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లగా... ఆమె ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ దృష్టికి ట్విట్టర్​ ద్వారా తీసుకెళ్లారు.

corona kits and ambulances
పలు ప్రాంతాలకు మరిన్నీ అంబులెన్సులు, కరోనా కిట్లు

By

Published : Apr 21, 2021, 10:38 PM IST

కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మెట్‌పల్లి, కోరుట్ల, నిజామాబాద్ ప్రాంతాలకు మరిన్నీ అంబులెన్స్‌లు, కరోనా పరీక్షల కిట్లును అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ ప్రాంతాలకు 7,500కరోనా టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానుండగా... ఇవాళ్టి నుంచి సిరికొండ మండలంలో అంబులెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకునేందుకు తగినన్నీ కిట్లులేవని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కవిత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జగిత్యాల కలెక్టర్లను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు.

మంత్రి ఈటల కరోనా కిట్ల విషయాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు కావాల్సిన కరోనా టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అంబులెన్స్​ల కొరత ఉందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవితతో ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడి సిరికొండ మండలానికి అంబులెన్స్ మంజూరు చేయించారు. ప్రజలు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details