తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఆదాయానికి లాక్‌'డౌన్‌'

ఆర్టీసీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. గతేడాది 55 రోజుల పాటు ఉద్యోగుల సమ్మెతో నష్టపోయిన సంస్థ.. తిరిగి కోలుకుంటుండగా కరోనా దెబ్బకు మళ్లీ కుదేలైంది.

Huge loss to Nizamabad District RTC Department with Corona
Huge loss to Nizamabad District RTC Department with Corona

By

Published : May 3, 2020, 11:17 AM IST

లాక్‌డౌన్‌కారణంగా నిజామాబాద్‌రీజియన్‌భారీగా నష్టాలు మూటగట్టుకుంటోంది. సమ్మె కాలంలో చోటు చేసుకున్న తప్పిదాలను దిద్దుకుంటూ సంస్థను గాడిలో పెట్టే క్రమంలో కోలుకోని దెబ్బ పడింది.

కామారెడ్డి, నిజామాబాద్‌జిల్లాల పరిధిలో(రీజియన్‌) నిజామాబాద్‌, 2, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌డిపోల్లో 670 బస్సులున్నాయి. మొత్తం 2800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1220 మంది కండక్టర్లు, 1030 మంది డ్రైవర్లు ఉన్నారు. మిగిలిన వారు క్లరికల్‌, మెకానికల్‌, ఇతర విభాగాల సిబ్బంది ఉన్నారు. నిత్యం రెండు లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

కొనసాగుతున్న అత్యవసర సేవలు...

సమ్మెకాలంలో సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల బస్సులు రోడ్డెక్కేందుకు రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిని ఎక్కువ రోజులు నడపకుండా ఉంటే మరమ్మతులకు గురవుతాయి. రాజధాని, గరుడప్లస్‌, ఇంద్ర తదితర ఏసీ బస్సులు పాడయ్యే అవకాశం ఉంది.

గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి డిపోలో రోజుకు 5 నుంచి 10 మంది మెకానిక్‌లు పని చేస్తున్నారు. వీరు రోజూ 5 నుంచి 10 నిమిషాల పాటు బస్సులను ఆన్‌చేసి ఉంచుతూ పాడవకుండా చూస్తున్నారు.

మరమ్మతులు లేకుండా చూస్తున్నాం...

లాక్‌డౌన్‌కారణంగా డిపోలకు పరిమితమైన బస్సులు పాడయ్యే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి డిపోలో మెకానిక్‌లతో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా ఏసీ బస్సులపై జాగ్రత్త వహిస్తున్నాం.

-సోలోమాన్‌, ఆర్టీసీ ఆర్‌ఎం

ABOUT THE AUTHOR

...view details