ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఈరోజు 96 కేసులు నమోదు కాగా.. కామారెడ్డి జిల్లాలో 263 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని కవితా కాంప్లెక్స్‌లోని అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వైరస్ కలకలం రేపింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా - Corona latest updates
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 96, కామారెడ్డి జిల్లాలో 263 కేసులు నమోదయ్యాయి.
విజృంభిస్తోన్న కరోనా
కార్యాలయంలో 60 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆరుగురు సిబ్బంది, మరో పది మంది దస్తావేజు లేఖరులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కార్యాలయంలో పనిచేసే మిగిలిన సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష