తెలంగాణ

telangana

ETV Bharat / state

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా... అప్రమత్తమైన అధికారులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొవిడ్‌ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పాఠశాల విద్యార్థులకు వైరస్‌ సోకటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు... వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. పరీక్షల సంఖ్య పెంచటం సహా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా... అప్రమత్తమైన అధికారులు
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా... అప్రమత్తమైన అధికారులు

By

Published : Mar 19, 2021, 5:20 AM IST

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా... అప్రమత్తమైన అధికారులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో కేసులు తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం మళ్లీ రెండంకెల సంఖ్యకు చేరుకున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉండటంతో పాటు ఇరువైపుల నుంచి రాకపోకలు సాగుతుండటం వల్ల కేసులసంఖ్య పెరుగుతోంది.

తనిఖీ కేంద్రం...

సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు... జిల్లాకు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నవారికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ తేలితే తిరిగి మహారాష్ట్రకు పంపిస్తున్నారు.

కరోనా బారిన విద్యార్థులు...

కామారెడ్డి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టెక్రియాల్‌ కస్తూర్భా విద్యాలయంలో 32 మందికి వైరస్‌ సోకగా... తాజాగా పిట్లంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 13మంది బాలికలకు పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. విద్యాలయంలోనే రెండు ప్రత్యేక గదులు ఏర్పాటుచేసి వారికి చికిత్స అందిస్తున్నారు.

నస్రుల్లాబాద్‌ ఉన్నత పాఠశాలలో ఒకరికి పాజిటివ్‌ తేలింది. ఈ క్రమంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ సూచించారు.

జాగ్రత్తలు పాటించాలి...

కరోనా నియంత్రణకు అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టెస్టుల సంఖ్యను పెంచుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నా మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు

ఇదీ చూడండి :'అంకెలు బారెడు... అప్పులు బోలెడు'

ABOUT THE AUTHOR

...view details