నిజామాబాద్ జిల్లాలో కరోనా మళ్లీ కలవరపెడుతోంది. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం రోజున 2702 మందికి పరీక్షలు చేయగా... 28 మందికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం ఇందల్వాయి మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 32 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా... ఐదుగురికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
కలవరపెడుతున్న కరోనా కేసులు.. ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలవరపెడుతోంది. సోమవారం ముగ్గురు ఉపాధ్యాయులకు కొవిడ్ సోకగా... మంగళవారం ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
corona cases in indalvai government high school
ఈ పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులకు రెండు రోజుల క్రితమే పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల విద్యార్థులకు కూడా పరీక్షలు చేయించారు. గ్రామంతో పాటు మండలవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నందున ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మండల వైద్యాధికారి శుభాకర్ సూచించారు. పాజిటివ్ సోకిన విద్యార్థులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు.