తెలంగాణ

telangana

ETV Bharat / state

జనాభా నియంత్రణే ప్రజల అభివృద్ధి - world population day

జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జనాభాను నియంత్రించడం అంటే ప్రజలను అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయడమేనని జిల్లా వైద్యాధికారి సుదర్శన్‌ తెలిపారు.

జనాభా నియంత్రణే ప్రజల అభివృద్ధి

By

Published : Jul 11, 2019, 11:30 AM IST

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. జనాభాను నియంత్రించడం అంటే ప్రజలను అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయడమేనని జిల్లా వైద్యాధికారి అన్నారు. జనాభా తగ్గించడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి శాఖ వారు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ నినాదాలు చేశారు.

జనాభా నియంత్రణే ప్రజల అభివృద్ధి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details