నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండలంలో గల ప్రజా నిలయంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో నమోదవుతున్న కరోనా కేసులలో పేద బలహీన వర్గాల వారే ఎక్కువగా ఉండడం వల్ల వారికి సాయంగా ఉంటామని తెలిపారు.
సునీల్ యువసేన ఆధ్వర్యంలో కరోనా బాధితులకు చేయూత - నిజామాబాద్ జిల్లా తాజా వార్త
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని కరోనా బాధితులకు అండగా ఉంటామని బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్‌రెడ్డి తెలిపారు. కొవిడ్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వారికి నిత్యావసర వస్తులు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
సునీల్ యువసేన ఆధ్వర్యంలో కరోనా బాధితులకు చేయూత
తక్షణమే ప్రజానిలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని.. ప్రతిగ్రామంలో సునీల్ యువసేన సభ్యులను ఇంఛార్జ్‌లుగా నియమించి కొవిడ్ భాదితులకు నిత్యావసర వస్తువులు పంచాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష