మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం - Conistable
ఎన్నికల విధులకు వెళ్ళిన ఓ కానిస్టేబుల్ మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. ఓ పెళ్లి ఇంట్లోకి చొరబడి హంగామా చేస్తే.. స్థానికులు పట్టుకొని చితకబాదారు.
![మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3209346-thumbnail-3x2-pc.jpg)
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని రంజిత్ నాయక్ తండా పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ తండాలో జరుగుతున్న పెళ్లి వద్దకు వెళ్లి వీరంగం సృష్టించాడు. విందులో పాల్గొంటున్న యువకులను బెదిరించి.. నానా గొడవ చేసినట్లు స్థానికులు తెలిపారు. పెళ్లి వారి ఇంట్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు తండావాసులు తెలిపారు. కానిస్టేబుల్ వ్యవహరించిన తీరును చూసి కోపోద్రిక్తులైన స్థానికులు చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియగానే.. తండాకు చేరుకుని గొడవకు కారణమైన కానిస్టేబుల్‌ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘటనా స్థలానికి నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సీఐ వెంకటేశ్వర్లు చేరుకుని విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో మద్యం సేవించి తాగిన మైకంలో వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.