పసుపు రైతులకు మద్దతుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రాజీవ్ రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ దీక్ష చేస్తోంది. పసుపు బోర్డు, మద్దతు ధర సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు హస్తం నేతలు తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా పసుపు బోర్డు తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రాంతంలోనే కాంగ్రెస్ దీక్ష చేయడం గమనార్హం.
పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటం - telangana congress protest for turmeric board
అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు పంటకు మద్ధతు ధరతో పాటు బోర్డు ఏర్పాటు చేస్తానన్న భాజపా ఎంపీ అర్వింద్ హామీ నిలుపుకోవాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టారు.
ఆర్మూర్‌లో రాజీవ్ రైతు భరోసా కార్యక్రమం
భాజపా ఎంపీ అర్వింద్ హామీ నిలుపుకోవాలని హస్తం నాయకులు డిమాండ్ చేశారు. అందరికీ శుభం కలిగించే పసుపు.. దాన్ని పండించే రైతుకు మాత్రం ఉరితాడుగా మారుతోందంటున్న కాంగ్రెస్ నేతలతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..