నిజమాబాద్ జిల్లా బోధన్ అంబేడ్కర్ చౌరస్తా నుంచి స్థానిక ఆర్డీవో కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బోధన్ ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో రాజేశ్వర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నిరసన - protest against lrs in bodhan
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆర్డీవో కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నిరసన
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్న ఈ స్కీంను వెంటనే ఉపసంహరించుకోవాలని హస్తం నేతలు డిమాండ్ చేశారు. ప్రజలు ఎల్ఆర్ఎస్ భయంతో ప్లాట్ల లావాదేవీలు చేయట్లేదని.. కొన్నవారు కూడా ఎల్ఆర్ఎస్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు.