నిజామాబాద్ జిల్లా బోదన్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్ పట్టణంలోని రహదారులన్నీ గుంతలమయం అవ్వడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకు దిగడం వల్ల రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు ఇచ్చినా.. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
బోధన్‌లో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రహదారులన్నీ గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
బోధన్‌లో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో
గుంతలమయమైన రోడ్లతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రహదారులకు త్వరగా మరమ్మతులు చేయకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
- ఇదీ చూడండి : 'మా వాడ ముద్దు.. వైన్స్ షాప్ వద్దు'