మొక్కజొన్న రైతుల ఆవేదన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న నాయకులు, రైతులను అరెస్ట్ చేయడం హేమమైన చర్య అని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ పిలుపు మేరకు చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వ మద్దతు ధర 1850 రూపాయలు ఉంటే దళారులు 1000 రూపాయలకే క్వింటాలు కొనుగోలు చేస్తూ రైతు బలహీనతపై దెబ్బకొడుతున్నారు. ప్రభుత్వం రైతుకు అండగా నిలవకపోవడం వల్ల దళారుల ఆగడాలకు అంతులేకుండాపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఆసరాగా నిలవాల్సిందిగా డిమాండ్ చేశారు.