నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల తొలగింపు వివాదాస్పదమైంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను జేసీబీతో తొలగించేందుకు సిబ్బంది రాగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా కూల్చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు.
బోధన్‌లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు - నిజామాబాద్ జిల్లా వార్తలు
బోధన్‌లో అక్రమ కట్టడాలు తొలగించే సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి నోటీసులు లేకుండా నిర్మాణాలను ఎలా కూర్చేస్తారని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ శివానందం వారికి నచ్చజెప్పారు.
![బోధన్‌లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు బోధన్‌లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6222925-thumbnail-3x2-d.jpg)
బోధన్‌లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు
మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ శివానందం, ఆర్డీవో గోపీరాంలు పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ప్రస్తుతం మార్కింగ్ చేస్తామని.. అక్కడి వరకు తొలగించుకోవాలని కమిషనర్ సూచించారు. లేదంటే తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
బోధన్‌లో వివాదస్పదమైన అక్రమ కట్టడాలు తొలగింపు