నిజామాబాద్ జిల్లా బాల్కొండలో శంకరదాసమయ్య మందిరం వద్ద ప్రహరి గోడ నిర్మాణం విషయంలో గురువారం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శంకరదాసమయ్య మందిరం చుట్టు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రహరి నిర్మాణ పనులను కోర్టు ఇంజక్షన్ ఆర్డర్‌తో గురువారం చేపట్టారు.
అయితే మందిరం చుట్టు ప్రహరి నిర్మిస్తే తాము రోడ్డు సౌకర్యం కోల్పోతామని మందిర సమీపంలోని కాలనీ వాసులు వారు ఆందోళన వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. అంతేకాకుండా చేపట్టిన పనులను కూల్చి వేశారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ప్రహరి నిర్మాణానికి కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ఉందని.. తాము నిర్మిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.