నిజామాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్, 77 వార్డ్ మెంబర్ల ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి - Complete randomization for local body elections in Nizamabad district
నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూరైంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి
106 మంది ప్రిసైడింగ్ అధికారులు, 119 మంది అదనపు పోలింగ్ సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 26వ తేదీన ఈ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో డీపీఓ జయసుధ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి