నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్... తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు విద్యార్హతలు సమర్పించాలని తెరాస నేత క్రిశాంక్... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివినట్లు అర్వింద్ ప్రజలకు అబద్ధాలు చెప్పడమే కాక... ఎన్నికల కమిషన్నూ తప్పదోవ పట్టించారని ఆరోపించారు.
ఎంపీ అర్వింద్‌పై ఈసీకి తెరాస నేత ఫిర్యాదు - Trs_Complaint_On_mp Arvind
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై తెరాస నేత క్రిశాంక్ రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు విద్యార్హతలు సమర్పించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్వింద్ ఎన్నిక చెల్లదని ఈసీ ప్రకటించాలని ఆయన కోరారు.
![ఎంపీ అర్వింద్‌పై ఈసీకి తెరాస నేత ఫిర్యాదు Trs_Complaint_On_mp Arvind](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382483-86-7382483-1590665257468.jpg)
ఎంపీ అర్వింద్‌పై ఎస్ఈసీకు ఫిర్యాదు
యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో అర్వింద్ పేరే లేదని క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉండగా... రాజస్థాన్‌లోని అనామిక వర్సిటీకే ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అర్వింద్ ఎన్నిక చెల్లదని ఈసీ చెప్పాలని... ఈ అంశంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు క్రిశాంక్ తెలిపారు.
ఇవీ చూడండి:పత్తికి అదనంగా రూ.275 పెంచండి!