తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్​ - వన్నెల్‌(బి), శ్రీరాంపూర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌ జితేంద్రకుమార్‌ పాటిల్‌ పర్యటన

నిజామాబాద్‌ జిల్లాలో పలు మండలాల్లో జరుగుతోన్న పల్లెప్రగతి పనులను జిల్లా అదనపు కలెక్టర్‌ లత పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

collector-visit-rural-development-progress-works-in-balkonda-nizamabad-district
పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్​

By

Published : Aug 10, 2020, 10:28 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, బస్సాపూర్‌ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ లత పర్యటించారు. పల్లెప్రగతి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వైకుంఠదామం, డంపింగ్‌యార్డులు, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులు, స్థానిక ఆదర్శ పాఠశాలలో నాటిన మొక్కలు, వాటిని పెంచుతున్న తీరుపై ఆరా తీశారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.

కమిషనర్‌ పర్యటన..

బాల్కొండ మండలం వన్నెల్‌(బి), శ్రీరాంపూర్‌లో నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ జితేంద్రకుమార్‌ పాటిల్‌ పర్యటించారు. గ్రామాల్లో డంపింగ్‌ యార్డులను నిర్వాహణ, తడిపొడి చెత్తను వేరుచేయడంపై వివరించారు. వైకుంఠధామం పనులను పరిశీలించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని చెప్పారు.

ఇదీ చూడండి :రానున్న రోజుల్లో తెరాస కుటుంబ ఆస్తిగా మిగిలిపోనుంది : బండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details