తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2021, 8:04 PM IST

ETV Bharat / state

'ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి'

నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సలకు సిద్ధం కావాలంటూ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సేవలందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

nizamabad collector narayana reddy, covid news nizamabad
నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కొవిడ్ వార్తలు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రులలోనూ తిరిగి పెద్ద సంఖ్యలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.

రోజురోజుకు వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా కనిపిస్తోందని.. పరిస్థితిపై దృష్టి సారించాలని కలెక్టర్​ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 172 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సేవలందించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్​వో సుదర్శనం, డాక్టర్ తుకారాం, డాక్టర్ రాజేశ్​, ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...

ABOUT THE AUTHOR

...view details