నిజామాబాద్ వరిపంటకు ప్రసిద్ధి చెందిన జిల్లాగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. రుద్రూర్‌లోని వరి, చెరకు పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళలో పాల్గొన్న ఆయన.. ప్రతి సంవత్సరం వరి నాట్లు తొందరగా మొదలై తొందరగా చేతికి వచ్చే జిల్లా నిజాబాద్ జిల్లా అని తెలిపారు.
యాంత్రిక పద్ధతి ద్వారా..
కూలీల కొరత ఉంటే.. యాంత్రిక పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని అవలంభించాలని రైతులకు తెలిపారు. దీని ద్వారా సమయాన్ని ఆదా చేసుకుని దిగుబడి కూడా పెంచుకోవచ్చని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్,బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇంఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు
ఇదీ చదవండి:న్యూ ఇయర్ ఎఫెక్ట్: హైదరాబాద్లో ఆ నిబంధనలు తప్పనిసరి!