తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందే: నారాయణరెడ్డి - collector narayanareddy

కరోనా పరిస్థితుల్లోనూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్​ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పక అమలు చేయాలని అధికారులకు సూచించారు.

collector narayanareddy participated in a programe in nizamabad
ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందే: నారాయణరెడ్డి

By

Published : Jun 21, 2020, 9:50 AM IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పక అమలు చేయాల్సిందేనని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టే ఎన్ఆర్​ఈజీఎస్​ పనులు పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలోనే జరగాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాహుల్​గాంధీ ఆడిటోరియంలో, ఆర్మూర్​లో పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం, ఆదాయ వ్యయాలపై ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా పల్లెలు అభివృద్ధి చెందాలని కలెక్టర్​ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ సిబ్బంది, వనరులు, అధికారాలు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని తెలిపారు. అధికారులు అవగాహనతో పనిచేస్తూ ముందుకు పోవాలని సూచించారు.

మున్సిపాలిటీల్లో మాదిరిగా గ్రామ పంచాయతీల్లోనూ ప్రతిరోజూ డ్రైనేజీలు, రోడ్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారానికి 2 సార్లు వార్డులను శుభ్రపరచాలన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్​, ఆర్డీవోలు, డీఎఫ్​వోలు, డీసీవోలతో కూడిన 10 మంది సభ్యుల బృందం సోమవారం నుంచి గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు.

ఇదీచూడండి: కరోనాను ఎదుర్కొనేందుకు యోగాసనాలు దోహదం:మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details