ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అదేశించారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం, ఆదాయ వ్యయాలపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతో కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు - awareness seminar with ps and sarpanchs in bodhan divison
బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య ప్రణాళికలు, హరితహారం, ఆదాయ వ్యయాలపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
ప్రభుత్వం కరోనా సమయంలో కూడా పంచాయతీలకు నిధులను విడుదల చేసిందని... ప్రతి పనిని ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ల వద్ద, రహదారుల వెంబడి మొక్కలు నాటాలని సూచించారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలపై దృష్టి సారించాలని సూచించారు.