నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్రనగర్, నందిపేట్, నుత్పల్లి, డొంకేశ్వర్ గ్రామాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నందిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాంపులు ఏర్పాటు చేసి కరోనా టెస్టులను పెంచాలని వైద్యులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాజరు పట్టిక పరిశీలించి.. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆంధ్రనగర్ విలేజ్ పార్క్‌ను సందర్శించి మొక్కలు నాటించాలని సర్పంచ్‌ను ఆదేశించారు.
పనిచేస్తే ప్రోత్సహిస్తాం... లేదంటే కఠినంగా వ్యవహరిస్తాం: కలెక్టర్ - నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో పర్యటన
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ నారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో జరిగిన జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులుకు పలు ఆదేశాలు జారీ చేశారు.
'మంచిగా పనిచేసే గ్రామపంచాయతీలకు అండగా ఉంటా'
నందిపేట్ మండల కేంద్రంలో శానిటేషన్ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నుత్పపల్లి, డొంకేశ్వర్ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను, విలేజ్ పార్క్‌లను పరిశీలించారు. మంచిగా పని చేసే గ్రామపంచాయతీలకు అండగా ఉంటామని.. పని చేయని వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, నందిపేట్ ఎమ్మార్వో అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా