ఉపాధి హామీ పనుల కోసం కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పనుల కోసం మండలం, గ్రామ స్థాయిలో పని అవసరమైనట్లైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు.
'ఉపాధి హామీ పనుల కోసం ఫోన్ చేయండి'
మీ గ్రామం, మండలంలో ఉపాధి హామీ పనుల కోసం వెతుకుతున్నారా అయితే ఒక్క ఫోన్ కొట్టండి సమాచారం తెలుసుకోండి. తాజాగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
'ఉపాధి హామీ పనుల కోసం ఫోన్ చేయండి'
08462-229797కు ఫోన్ చేసినట్లైతే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వినియోగంలో ఉంటుందని చెప్పారు. పని కల్పించడంలో ఏవైనా డబ్బు చెల్లింపు సమస్యలున్నా పరిష్కరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి :కంటైనర్ నుంచి రూ.2 కోట్ల విలువైన సెల్ఫోన్ల అపహరణ..