తెలంగాణ

telangana

ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: నారాయణరెడ్డి

By

Published : Dec 4, 2020, 11:43 AM IST

నిజామాబాద్​ కలెక్టరేట్​లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి వారికి పలు సూచనలు చేశారు.

Collector Narayana Reddy meeting with women fisheries co-operative societies
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి: నారాయణరెడ్డి

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న రివాల్వింగ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్​లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్ ఫండ్ రూ.50 లక్షల చెక్కులను 16 మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.

ప్రభుత్వం మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తోన్న ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ సూచించారు. కష్టపడి పని చేస్తే మీరే పది మందికి పని కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సంఘంలో వంద కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘానికి రూ.5 లక్షలు, వంద కంటే తక్కువ మంది ఉన్న సభ్యులున్న సంఘానికి రూ.3 లక్షల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంఛార్జ్​ ఏడీ ఫిషరీస్ దేవేందర్, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కో-ఆపరేటివ్ డైరెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 631 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details