దిల్లీ వెళ్లొచ్చిన 63 మందితో పాటు వారి ప్రైమరీ కాంటాక్ట్స్ 389 మందిని గుర్తించి వారి నమూనాలు పంపగా అందులో 13 మినహా అన్నీ నెగెటివ్ అని వచ్చాయని నిజామాబాద్ జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న 13 నమూనాలలో ఇంకా ఏమైనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉండొచ్చన్నారు. కాగా ఇప్పటికి మొత్తం 52 పాజిటివ్ కేసులు వచ్చాయని ఈ సంఖ్య చిన్నదేమీకాదని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాయిస్ మెసేజ్ ద్వారా కలెక్టర్ జిల్లా వాసులకు సూచించారు.
'ఈ పదిరోజులు కీలకమైనవి' - కరోనా పాజిటివ్ కేసులు
నిజామాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం 52 కేసులు నమోదయ్యాయని.. జిల్లాలో మరింత పటిష్ఠంగా లాక్డౌన్ ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వాయిస్ మెసేజ్ ద్వారా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
'ఈ పదిరోజులు కీలకమైనవి'
" ఈ పదిరోజులు మనకు మరింత కీలకమైనవి.. జిల్లాలో వైరస్ వ్యాప్తిని గుర్తించి.. నివారించడానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు మాకు సహకరించి ఇళ్లలోనే ఉండాలి- జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి"
ఇదీచదవండిఃఈనెల 16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ