కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్ కిట్ అందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, ధర్మారం(బి) గ్రామాల్లో నిర్వహిస్తోన్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఫీవర్ సర్వేను వేగవంతం చేయాలి: నారాయణరెడ్డి - nizamabad district Collector Narayana Reddy latest news
ఫీవర్ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, ధర్మారం(బి) గ్రామాల్లో జరుగుతోన్న సర్వేను ఆయన పరిశీలించారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారికి వెంటనే మెడికల్ కిట్ అందజేయాలని సిబ్బందికి సూచించారు.
Collector Narayana Reddy
స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ అందించి.. వారు హోం ఐసోలేషన్లో ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. మెడికల్ సిబ్బంది ఇచ్చిన మందులు వాడాలని.. తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి.. రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు