ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు నిజమాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఎంఆర్ఎం రావు సూచించారు. జిల్లావ్యాప్తంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పలు గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలో 85 శాతం తక్కువ కాకుండా మొక్కలను బతికించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు మహమ్మద్ అత్తరుద్దీన్, బాలగంగాధర్, సర్పంచ్ గంగ మణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి' - పరిశీలించిన కలెక్టర్
30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ ఎంఎంఆర్ఎం రావు తనిఖీ చేశారు.
!['గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4449406-thumbnail-3x2-vysh.jpg)
'గ్రామ పరిశుభ్రతకు అందరూ శ్రమదానం చేయాలి'