నూతన సమీకృత కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ పనులు పూర్తయ్యాయన్నారు. కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పరిశీలన - New collecteret bhavan
నిజామాబాద్ నగర శివారులో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Collecteret visited in nizamabad district
మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన గదులు పరిశీలించారు. పెండింగ్ పనులు పూర్తి అయ్యాయని కావాలసిన ఫర్నిచర్ వచ్చిందని తెలిపారు. కార్యాలయాల వారీగా పనుల తయారీకి ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రాంబాబు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. మత్తు మందుల అక్రమ రవాణా.. తప్పించుకుంటున్న సూత్రధారులు