తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​ - సీఎంవో ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్

పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములై గ్రామ పంచాయతిని అభివృద్ధి చేసుకోవాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్​ కోరారు. నిజామాబాద్​ జిల్లా చంద్రాయన్​ పల్లిని ఆమె, ఓస్డీ ప్రియాంక వర్గిస్​లు సందర్శించారు.

పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​
పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​

By

Published : Jan 6, 2020, 3:44 PM IST

పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములవ్వాలి: స్మిత సబర్వాల్​
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సీఎంవో ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గిస్​లు నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లిలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులు, ప్రజలతో నేరుగా మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. పల్లె ప్రగతిలో ప్రజలే భాగస్వాములై గ్రామ పంచాయతిని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details