ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి జిల్లాలో కాళేశ్వరం పనుల ప్రగతిని పరిశీలించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మిస్తోన్న ప్యాకేజి 20, 21, 21ఏ పనులను పర్యవేక్షించారు. జిల్లాలోని బినోల, సారంగాపూర్, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి వద్ద పంప్‌హౌజ్, సర్జిపూల్, టన్నెల పనులను పరిశీలించి, అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెంట్రాజ్‌పల్లి వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, నిధులు, ఇతర అంశాలపై సమీక్షలో చర్చించి దిశానిర్దేశం చేశారు. స్మితా సబర్వాల్ పర్యటనతో పనుల్లో మరింత వేగం పెరగనుందని మంత్రి తెలిపారు. రైతులు కాళేశ్వరం పనులకు సహకరించి, పూర్తయ్యేలా చూడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
'4లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు కసరత్తు' - CMO SMITHA SABARWAL, MINISTER VEMULA PRASHANTREDDY VISIT KALESWARAM PROJECT
కాళేశ్వరంలో భాగంగా నిర్మిస్తోన్న ప్యాకేజి 20, 21, 21ఏ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని బినోల, సారంగాపూర్, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి వద్ద పంప్‌హౌజ్, సర్జిపూల్, టన్నెల పనులను పరిశీలించి... అధికారులకు దిశానిర్దేశం చేశారు.
CMO SMITHA SABARWAL, MINISTER VEMULA PRASHANTREDDY VISIT KALESWARAM PROJECT